రాజోలు మండల సీపీఎం శాఖా కార్యదర్శిగా కారుపల్లి గోపాలన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం రాజోలు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరిగిన శాఖ మహాసభకు సీపీఎం జిల్లా కన్వీనర్ కె. వెంకటేశ్వరరావు పరిశీలకునిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం, పేదల పక్షాన సీపీఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.