మలికిపురం: దాళ్వా నారుమడులు సిద్ధం చేస్తున్న రైతులు

80చూసినవారు
మలికిపురం: దాళ్వా నారుమడులు సిద్ధం చేస్తున్న రైతులు
మలికిపురం మండలంలోని ఈ ఏడాది సార్వా సాగు దూరమైన రైతులు అందరూ దాళ్వా సాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేశారు. గుడిమెలంక, మేడిచర్ల పాలెం గ్రామాలలో ముందుగా నారుమడులు వేసిన రైతులు నాట్లు వేసే పనులు ప్రారంభించారు. మిగిలిన గ్రామాలలో రైతులందరూ నారుమడులు త్వరితగతిన పూర్తిచేసుకుని నాట్లు వేసేందుకు సిద్ధపడాలని వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం సూచించారు.

సంబంధిత పోస్ట్