రాజోలు: ఉపకరణాలకు 450 మంది దివ్యాంగులు ఎంపిక

81చూసినవారు
రాజోలు మండలం శివకోడు మంగిన గంగయ్య కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల లబ్ధిదారుల ఎంపిక శిబిరం ద్వారా 450 మందిని ఎంపిక చేశారు. రాజోలు మండలం నుంచి 123 మందిని, మలికిపురం మండలం నుంచి 111 మందిని, మామిడికుదురు మండలం నుంచి 115 మందిని, సఖినేటిపల్లి మండలం నుంచి 101 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. వీరికి అవసరమైన ఉపకరణాలను త్వరలోనే అందజేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్