రాజోలు: 'అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలి'

63చూసినవారు
రాజోలు: 'అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలి'
భూమిలేని కౌలు రైతులందరికీ సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజోలు మండలంలోని కడలి, వేగివారిపాలెం, చెన్నడం తదితర గ్రామాల్లో పర్యటించి కౌలు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కౌలు రైతులందరికీ సొంత పూచీకత్తుతో పంటరుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్