రాజోలు: ఉపాధి నిధులతో ఎనలేని అభివృద్ధి: ఎమ్మెల్యే

52చూసినవారు
రాజోలు: ఉపాధి నిధులతో ఎనలేని అభివృద్ధి: ఎమ్మెల్యే
ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో ఎనలేని అభివృద్ధి జరుగుతుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలలో భాగంగా రాజోలు మండలం, కూనవరం గ్రామంలో సీసీ రోడ్డుకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్