దళిత సాహిత్యంతోనే దళితుల్లో చైతన్యం తీసుకొస్తామని ప్రముఖ దళిత కవి నేలపూరి రత్నాజీ అన్నారు. రాజోలులో దళిత కవుల, రచయితల సమావేశం బుధవారం దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. రచయిత అడిదల రాజబాబు మాట్లాడుతూ దళిత సమాజంలో మార్పు తీసుకురావడానికి దళిత కవులు రచయితలు విశేషమైన కృషి చేయ్యాలన్నారు. డొల్ల మార్టిన్ మాస్టర్ వ్రాసిన అంబేడ్కర్ సూక్తుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.