అల్పపీడనం నేపథ్యంలో రాజోలు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. దీంతో కళాశాల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే రైతు కూలీలు తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. వర్షానికి తోడు చలి కూడా ఎక్కువగా ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు.