సమాజ శ్రేయస్సు, సేవే ధ్యేయంగా వాసవి క్లబ్ పని చేస్తోందని వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్య ప్రకాష్ అన్నారు. ఆదివారం రాజోలు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వాసవి రీజియన్ ఛైర్ పర్సన్ రాజా నాగరత్న కుమార్ అధ్యక్షతన రాజామృత వర్శిణి సేవా సుధ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సాయిసూర్య ప్రకాష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.