రాజోలు మండలం కడలిలో పంట బోదును పూడ్చి అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది యాలంగి రమేష్ సోమవారం తహశీల్దారు ప్రసాదుకు వినతిపత్రం అందించారు. సుమారు 50 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే పంట బోదును గ్రామంలో కొందరు వ్యక్తులు పూడ్చి అక్రమ కట్టడాలు కడుతున్నారు. అక్రమ కట్టడాలు తొలగించి, పంట బోదు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.