రాజోలు: డివైడర్ ను ఢీకొట్టిన లారీ

71చూసినవారు
రాజోలు మండలం తాటిపాక సెంటర్లో ఊక లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ ను ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం. కడలి నుంచి తాటిపాక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న డ్రైవర్ తో పాటు క్లీనర్ కు ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు మధ్యలో లారీ నిలిచిపోవడంతో దాన్ని పక్కకు తప్పించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్