రాజోలు: త్వరలో మరో పార్టీలో చేరుతా: మాజీ ఎమ్మెల్యే రాపాక

77చూసినవారు
వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. 'గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా టికెట్ టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్ఛార్జ్ గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా' అని మీడియాకు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్