సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకు వచ్చింది. రాకాసి అలలు ఎగిసిపడి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గురువారం సముద్ర తీరంలో బలమైన ఈదురుగాలులకు సముద్రపు అలలు తోడు కావడంతో స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. స్థానికంగా ఉన్న దుకాణాల సముదాయాలను సముద్రం నీరు సమీపించింది.