కత్తిమండ పంచాయతీని ముట్టడించిన గ్రామస్థులు

63చూసినవారు
మలికిపురం మండలం కత్తిమండలో గ్రామస్థులకు చర్చి పాస్టర్ కు మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో శుక్రవారం గ్రామస్థులు కత్తిమండ పంచాయతీని ముట్టడించి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్చి పాస్టర్ వ్యవహరిస్తున్నాడని ఆందోళన చేపట్టారు. వినాయక గుడికి పక్కన ఉన్న స్థలంలో చర్చి పెట్టవద్దని గ్రామస్థులు అంటున్నారు. సీఐ నరేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సర్పంచ్ ని కలిసి వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

సంబంధిత పోస్ట్