కోటనందూరు మండలం బోద్దవరం గ్రామంలో సున్నా వడ్డీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సందర్భంగా బోద్ధవరం గ్రామ యానిమేటర్లు ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథిగా సర్పంచ్ వేగిలక్ష్మి అప్పలనాయుడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైయస్సార్ గవర్నమెంట్ సున్నా వడ్డీ పేరుతో గ్రామానికి 92 గ్రూపులకు గాను 5 లక్షల 66 వేల 849 రూపాయలు విడుదల చేసిందని ఇలా అనేక రకాలైన పథకాలతో మహిళలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాలైన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మహిళలును ప్రోత్సహించి ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది అని అన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ఇచ్చిన మాట ప్రకారం వైయస్సార్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల గుడుదుర్గాభవాని వరహాలు నాయుడు, ఉపసర్పంచ్ యల్లపు రమణ, వైయస్సార్ సిపి నాయకులు మల్ల శ్రీను, యల్లపు రామసూరి, వేగి బాబురావు, డ్వాక్రా యానిమేటర్లు వేగి సత్యవేణి, వడ్లమూరి నాగలక్ష్మి, ఆడారి జగదీశ్వరి డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.