ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిదాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు నాడు నేడు పేజ్ 2 పనులకు టనందూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న నాడు నేడు పనులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాలని, పనులలో ఎక్కడ లోపాలు కనిపించకూడదని సర్పంచ్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హైస్కూల్ చైర్మన్ యు. శ్రీను, ప్రాథమిక పాఠశాల చైర్మన్ కే. బాలు, వైసిపి నాయకులు కే. రాము, గంగాధర, అప్పారావు పాల్గొన్నారు.