కోటనందూరు: వర్షంతో అన్నదాతల్లో వణుకు

85చూసినవారు
అల్పపీడన ప్రభావంతో కోటనందూరు మండల వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో కోతలు జోరుగా కొనసాగుతుండగా పలుచోట్ల కోసిన వరి పనలు పొలాల్లో ఆరబెట్టారు. కొత్తకొట్టాం గ్రామంలో కోసిన పంటలు తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్