కాకినాడ జిల్లా తుని తాండవ నది పరీవాహక ప్రాంతాన్ని తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదివారం సాయంత్రం పరిశీలించారు. మూడు రోజుల కిందట తాండవ నదిపై రక్షణ గోడ సైతం కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే దివ్య చేరుకుని ప్రత్యేకంగా పరిశీలించారు. తాండవ ఉదృతిని దృష్టి ఉంచుకుని అధికారులు పశువుల కాపరులు, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.