తుని: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా

67చూసినవారు
తుని: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా
తుని పట్టణ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందిని దివాణం వీధిలోని కోర్టులో శుక్రవారం హాజరుపరిచామని సీఐ ఎం. గీతా రామకృష్ణ మీడియాకు తెలిపారు. వీరికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఒక్కొక్కరికీ రూ. 10 వేలు చొప్పున రూ. 1. 20 లక్షలు జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు అని ఈ సందర్భంగా వారికి సూచించారు. మరోసారి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్