రూ.25 కోట్లతో ప్రాజెక్టు అంచనాలు సిద్ధం
ఏలేరు ప్రాజెక్టు వరదల కారణంగా కిర్లంపూడి మండలంలో భారీగా నష్టం జరిగిందని, ఇంత పెద్ద స్థాయిలో వరద రావడం ఇది రెండవసారి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి రాకుండా పటిష్ఠమైన నిర్మాణ పనులు చేపట్టాలని, దీనికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించినట్లు ఆయన చెప్పారు. రూ. 25 కోట్లలతో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని గురువారం ఆయన మీడియాతో తెలిపారు.