ఏలేరు వరదల కారణంగా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో గండ్లు పడిన ప్రాంతాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం పరిశీలించారు. ఈ మేరకు ఆయన గండ్లు పూడ్చడానికి చేపట్టవలసిన చర్యలపై ఆయన పెద్దాపురం ఆర్డీవో సీతారామారావుతో, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఇర్రిపాక నుండి కిర్లంపూడి మండలం ముక్కోలు వరకు రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.