చిరుతను గుర్తించేందుకు 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు
కడియంలో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. రెండు బోనుల్లో చిరుతకు ఎరగా మేక పిల్ల, పందిని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం చిరుత కదలికను పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బుర్రిలంక సమీపంలోని నర్సరీలో గుబురుగా ఉన్న ఈత చెట్ల పొదల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.