పండ్లును స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వండి
పండ్లును స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని రాష్ట్ర టిడిపి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పౌష్టికాహార మాస ఉత్సవాల్లో భాగంగా కడియం మండలంలోని కడియపులంక పంచాయతీ వద్ద శనివారం గర్భిణీ ఆహ్వాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహార కిట్లను గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ అందజేశారు.