రాజమండ్రి: అంగన్వాడీ కేంద్రాల వసతులపై కలెక్టర్ సూచనలు
తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషకాహార కిట్ల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.