రాజమండ్రి: అసాంఘిక శక్తులను అణచివేసేందుకు చర్యలు

76చూసినవారు
రాజమండ్రి: అసాంఘిక శక్తులను అణచివేసేందుకు చర్యలు
తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమండ్రి అర్బన్ పరిధిలో 6 స్పెషల్ పార్టీలు & ఒక మహిళా రక్షక్ టీంతో రాత్రివేళ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. రాజమండ్రి అర్బన్ పరిధిలో అసాంఘిక శక్తులను, కార్యకలాపాలను అణచివేసేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ స్పెషల్ టీంల ద్వారా అట్టివారిపై ఉక్కు పాదం మోపుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్