ఏపీ ఓటర్ల జాబితాలో అక్టోబరు 1 నాటికి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చనున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన ఓటర్ల జాబితాలో సవరణతో పాటు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రారంభించనున్నట్లు ఈసీ తెలిపింది. అక్టోబరు 29 ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, నవంబర్ 28 వరకు అభ్యంతరాలను ఈసీ స్వీకరించనుంది. 2025 జనవరి 6 తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.