ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈసీ నోటీసులు

75736చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈసీ నోటీసులు
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏపీ ఎన్నిక‌ల సంఘం నోటీసులు ఇచ్చింది. ఇటీవల అనకాపల్లి సభలో ప‌వ‌న్ ఎన్నిక‌ల కోడ్ ఉల్ల‌ఘించార‌ని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ప‌వ‌న్‌ను ఆదేశించింది. కాగా, ఇటీవ‌ల జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్