చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. గతేడాది అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన అమెరికా పోలీసులు తాజాగా సుచిర్ బాలాజీది హత్య కాదని ఆత్మహత్య అని తేల్చారు. దీంతో కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు.