ప్రస్తుతం CBSE టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి సాహసమే చేశాడు. మహారాష్ట్ర, సతారా జిల్లాకు చెందిన మహంగడే అనే విద్యార్థి వ్యక్తి గత పని నిమిత్తం పంచగని వెళ్లాడు. అక్కడ నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి పారా గ్లైడింగ్ చేస్తూ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. నిపుణుడి సాయంతో గాల్లో ఎగురుతూ ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు.