పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలో నూతన మద్యం షాపు జనవాసాల దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. మద్యం షాపు వల్ల విద్యార్థులకు, మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిర్యాదులో పేర్కొన్నారు.