పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ పర్యటించిన వైద్య సిబ్బంది పలువురు చిన్నారులు, వృద్ధులు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. పీహెచ్ సి సిబ్బంది, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్ వడి టీచర్ విజయమ్మ, పైలట్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.