తాడేపల్లిగూడెంకు చెందిన దాసీలాల్ టాక్సీ కారులో కుటుంబ సభ్యులతో కలిసి రావులపాలెం వెళుతుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి కల్వర్టు ఢీకొంది. ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ పెనుబోయిన సరదా ప్రసాద్ (57) మృతి చెందగా. దాసీలాల్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అయితే నిద్రమత్తులో ఈ కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.