వైసీపీ సోషల్ మీడియా ముసుగులో అనుచితమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఆచంట నియోజకవర్గ నాయకులు సిర్రా బాలాజీ కోరారు. ఈ మేరకు పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్‌కు ఆచంట ఎస్ఐ వెంకటరమణకు శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయాలన్నారు.