ప.గో: కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు పొందాలి

52చూసినవారు
వినియోగదారులు కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వస్తువుకి తప్పనిసరిగా బిల్లును పొందాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొని వినియోగదారుల రక్షణ చట్టం పై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్