పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వైసిపి నేతలు రైతన్నలకు అండగా అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాదయాత్రగా కలెక్టరేట్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వంలో రైతులను ఆదుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను గాలికి వదిలేసారని విమర్శించారు.