పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలో 2వ స్థానము, విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలలో 5వ స్థానములో నిలిచాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన డిసెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు నందు అన్ని జిల్లాల విద్యాశాఖల పనితీరును సమీక్షించి, వివిధ అంశాల్లో జిల్లాల వారిగా ర్యాంకింగ్ ను ప్రకటించడం జరిగిందన్నారు.