భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘ ఆధ్వర్యంలో సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఎపిఐఐసి కార్పోరేషన్ చైర్మన్ మంతెన రామరాజు లను సత్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు భీమవరంలో అన్ని సంఘాలు ఎంతో ఐక్యతతో ఉంటాయని, ఆర్యవైశ్య వర్తక సంఘం సమాజ సేవలో చురుకైన పాత్ర వహిస్తుందని అన్నారు.