రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరి భాస్కరయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారుల సంఘం భీమవరం పట్టణ మహాసభ స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం డి. అమ్మరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రజకులకు సామాజిక రక్షణ చట్టం ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం మాదిరిగా తీసుకురావాలన్నారు.