భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో పెండింగ్ లో ఉన్న మినీ స్టేడియంను వెంటనే పూర్తి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే శుక్రవారం మాట్లాడుతూ 2014 -2019లో మినీ స్టేడియం ఏర్పాటుకు పునాదులు, పిల్లర్లు వేయడం జరిగిందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్మాణం జరగలేదని, పట్టించుకోలేదని, దీనిపై శ్రద్ధ చూపి మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.