పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని భీమేశ్వర స్వామి దర్శనాన్ని ఆలయ మరమ్మతుల నిమిత్తం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో తోట శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30న సాయంత్రం 4. 31 గంటలకు సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కావున భక్తులు సహకరించాలని కోరారు.