జంగారెడ్డిగూడెంలో దారుణం

75చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య శైలజపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రవిచంద్ర  వివరాలను సేకరించారు. అయితే కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్