జంగారెడ్డిగూడెం అన్నా క్యాంటీన్లో అల్పాహారం

84చూసినవారు
జంగారెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను శుక్రవారం ఉదయం టీడీపీ నాయకులు పెనుమర్తి రాంకుమార్, నంబూరి రామచంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వారు క్యూ లైన్లో నిలబడి టోకెన్ తీసుకొని అల్పాహారాన్ని సేవించారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశీలించి క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సంబంధిత యాజమాన్యానికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్