మేకపోతులు ఎత్తుకెళ్లిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం. ఇందిరానగర్ కాలనీకి చెందిన పీరుకు మాంసం విక్రయ దుకాణం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి మేకపోతులు కొనుగోలు చేసి, ఇంటి వద్దనున్న షెడ్డులో ఉంచుతాడు. ఈ నెల 3న అర్ధరాత్రి దాటాక నలుగురు దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి రూ. 1.20 లక్షలు విలువ చేసే ఆరు మేకపోతులు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.