ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి భానుడి వేడిమీతో అల్లాలడిపోయిన ప్రజానీకం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. అనంతరం ఒక్కసారిగా ఉరుములుతో కూడిన వర్షం కురిసింది. దీంతో జన జీవనం స్తంభించగా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.