జంగారెడ్డిగూడెం: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

83చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ సమీపంలో ఆదివారం ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు నాగాలాండ్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా చికెన్ తీసుకువస్తానని బయటకు వచ్చాడని బంధువులు తెలిపారు. ఒంటిపై రక్తపు మరకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్