ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సచివాలయం ఎదుట నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతోందన్నారు. సెప్టెంబర్ 6న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యదర్శికి వినతిపత్రం అందించారు.