జంగారెడ్డిగూడెం టూ ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కామవరపుకోట మండలం తడికలపూడి శివారు నుంచి రోడ్డు పక్కల ఉన్న ఎన్నో ఏళ్ల నాటి భారీ నిద్రమామిడి చెట్లను అధికారులు తొలగిస్తున్నారు.