జంగారెడ్డిగూడెం: సాయిబాబా ఆలయంలో చోరీ

70చూసినవారు
జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్న సాయిబాబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు ఆలయ పురోహితులు తెలిపారు. శనివారం సీసీ ఫుటేజీ పరిశీలించగా ఆలయం వెనక నుంచి వచ్చి సీసీ కెమెరా ధ్వంసం చేసి హుండీని తీసుకువెళ్లినట్లు గుర్తించామన్నారు. స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో ఖాళీ హుండీని కనుగొన్నామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్