తాళం వేసిన ఇంట్లో చోరీ

55చూసినవారు
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లిన ఘటన పెదపాడు మండలంలో చోటుచేసుకుంది. వీరమ్మకుంటకు చెందిన సోమేశ్వరరావు గత నెల 23న ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు ఊరెళ్లారు. ఆదివారం గ్రామానికి తిరిగొచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా. బీరువాలో దాచిన 8 కాసుల స్వర్ణాభరణాలు, రూ. 10 వేలు నగదు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్