దెందులూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా
దెందులూరు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కరించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.