పెదవేగి: జనతా క్యాంటీన్ కు పోటెత్తిన మాలదారులు

78చూసినవారు
పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఎన్టీఆర్ చింతమనేని జనతా క్యాంటీన్ కు మంగళవారం వేలాది సంఖ్యలో అయ్యప్ప, భవాని మాలాదారులు పోటెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా మాల వేసుకున్న భక్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉదయం పూట అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మాలదారులు ఇక్కడకు చేరుకొని అల్పాహారం సేవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్